Share News

ప్రధాన మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:46 PM

పేద, మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ఆర్థిక భారం తగ్గించేందుకు చేపట్టిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ప్రధాన మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ప్రధాన మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

రామగిరి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): పేద, మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ఆర్థిక భారం తగ్గించేందుకు చేపట్టిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ప్రధాన మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిత్యావసర వస్తువుల పై జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సెం టినరీకాలనీలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మండల ప్రధాన కార్యదర్శి తొట్లరాజు, ఉపాధ్యక్షుడు నాంసాని మహేష్‌, పట్టణ అధ్యక్షుడు చిదురాల శివప్రసాద్‌, మహిళా అధ్యక్షురాలు రొడ్డ వరలక్ష్మి, నాయకులు ఎం.డి జానీ, గనిరెడ్డి నాగరాజు, క్రాంతికుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌, (ఆం ధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు ఆది వారం ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జీఎస్టీ విధానంలో మార్పులు చేయడం వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగంగా మారుతున్నదని వారు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద, మధ్యతరగతి బతుకులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగర వేయడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, సీనియర్‌ నాయకులు మట్ట శంకర్‌, జంగపల్ల అజయ్‌, మల్లారపు అరుణ్‌ కుమార్‌, పంతకాని విశ్వతేజ, కొమ్ము శ్రీనివాస్‌, గట్టు శ్రీనివాస్‌, అగ్గి శ్రవణ్‌, మేదర్‌ లింగస్వామి, ఆసం శ్రీనివాస్‌, గొట్టె సంపత్‌, తూండ్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:46 PM