Share News

కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:29 AM

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 15 నుండి నిరవధిక సమ్మె చేపడుతామని మధ్యాహ్న భోజన వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ హెచ్చరించారు.

కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 15 నుండి నిరవధిక సమ్మె చేపడుతామని మధ్యాహ్న భోజన వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏఓకు వినతి పత్రం అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ 23 ఏళ్లుగా డిమాండ్ల సాధనకు పోరాటాలు చేస్తున్నామని, ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలు రూ.10 వేల వేతనం, కార్మికుల సమస్యలు తీర్చుతామని చెప్పి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. గత నెలలో జిల్లా విద్యాధికారికి వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని, ఈ నెల 15 నుంచి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. నాయకులు విజయ, రత్నమాల, రాజేశ్వరి, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:30 AM