Share News

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:21 AM

జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో సత్వరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వాణిశ్రీ అన్నారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

సుల్తానాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో సత్వరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వాణిశ్రీ అన్నారు. గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. గర్రెపల్లితో పాటు కొలనూరు, ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి గురించి చర్చించారు. ఆప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ తెలియజేయడం పై ఆశాలకు అవగాహన కల్పించారు. ఈ విషయంలో తల్లులకు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు తప్పనిసిగా ఎర్లీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచిస్తూ తొలి రెండు ఆరోగ్య పరీక్షలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, మూడు, నాలుగవ పరీక్షలను సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించుకోవాలన్నారు. గర్భిణీల తరలింపునకు 102 వాహన సేవలు వినియోగించుకోవాలన్నారు.

గ్రామాల వారీగా జ్వరాల సర్వే చేయించాలి

గ్రామాల వారీగా జ్వరాల సర్వే నిర్వహించాలని, జ్వర లక్షణాలు నమోదు చేసుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలని, గ్రామాలలో దగ్గు తగ్గని వారిని గుర్తించి జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, ఎవరూ కూడా వ్యాక్సిన్‌ డ్యూ లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ రాజమౌళి, డాక్టర్లు బి శ్రీరాములు, కెవి సుధాకర్‌ రెడ్డి, బి కిరణ్‌ కుమార్‌, ఉదయ్‌, జిల్లా డేటా మేనేజర్‌ మహేందర్‌, డీపీఎం దేవిసింగ్‌, డిపిసీ తీట్ల రాజేశం, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:21 AM