వైద్య సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:47 PM
వివిధ వ్యాధులతో చికిత్స కోసం వచ్చే పేషంట్ల ద్వారా కొన్ని వ్యాధులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంక్రమించే ప్రమాదం ఉందని, ఇందుకు సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు.
సుల్తానాబాద్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): వివిధ వ్యాధులతో చికిత్స కోసం వచ్చే పేషంట్ల ద్వారా కొన్ని వ్యాధులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంక్రమించే ప్రమాదం ఉందని, ఇందుకు సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. మంగళవారం గర్రెపల్లి పీహెచ్‌సీలో వైద్యసిబ్బందికి హైపటైటిస్ బీ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఈ వ్యాధి ముఖ్యంగా రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని, ఇది సోకిన పేషెంట్లకు సేవలు అందించే క్రమంలో వైద్య సిబ్బందికి వ్యాధి బారినపడే అవకాశం ఉంటుందన్నారు.
దీనికి వైద్య సిబ్బంది రక్షణ కోసం ఈ వ్యాధి నిరోధక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సిబ్బంది తప్పనిసరిగా జీరో డోస్ తీసుకున్నాకా నెలకు ఒక డోస్, ఆరు నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రోగ్రాం అధికారి కిరణ్ కుమార్, వైద్యుడు ఉదయ్, న ర్సింగ్ ఆఫీసర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.