Share News

మున్సిపల్‌ కార్మికులకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:54 PM

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు శుక్రవారం రామగుండం పట్టణ ఆరోగ్యం కేంద్రంలో వైద్య పరీక్షలు జరిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్నా ప్రసన్న ఆధ్వర్యంలో వైద్యులు ఈ పరీక్షలు జరిపారు.

మున్సిపల్‌ కార్మికులకు వైద్య పరీక్షలు

కోల్‌సిటీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు శుక్రవారం రామగుండం పట్టణ ఆరోగ్యం కేంద్రంలో వైద్య పరీక్షలు జరిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్నా ప్రసన్న ఆధ్వర్యంలో వైద్యులు ఈ పరీక్షలు జరిపారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నిత్యం అపరిశుభ్ర పరిస్థితుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని, ప్రతీ నెల పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ తరపున అవుట్‌ పేషెంట్‌ కార్డులను పంపిణీ చేశారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు సాదిక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ మధుకర్‌, ఎంఐఎస్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌, మెప్మా సీఓలు శ్వేత, ఊర్మిళ, ప్రియదర్శి, శానిటరీ జవాన్‌ సోమేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:54 PM