Share News

సీజనల్‌ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:33 PM

సీజనల్‌ వ్యాధు లపై వైద్యారోగ్య శాఖ సిబ్బందితోపాటు ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉండా లని, నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. మంగళవారం రాగినేడు, గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు

పెద్దపల్లి టౌన్‌/సుల్తానాబాద్‌, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధు లపై వైద్యారోగ్య శాఖ సిబ్బందితోపాటు ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉండా లని, నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. మంగళవారం రాగినేడు, గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి శుక్ర వారం డ్రై డే పాటించాలని, ఆశ వర్కర్లు కనీసం 30 గృహాలు సందర్శిం చాలన్నారు. దోమ లార్వా పెరుగుదల, నిల్వ గుర్తించాలన్నారు. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలని, జ్వరాల సర్వే నిర్వహిం చాలన్నారు.

గర్భిణీలకు మూడు నెలల లోపు నమోదు చేయాలని, వారికి మొదటి రెండు పరీక్షలు ఆరోగ్య కేంద్రాలలో, మిగిలిన 3, 4వ పరీక్షలు కమ్యూనిటీ, ప్రసూతి ఆసుపత్రుల్లో చేయించాలన్నారు. ప్రభుత్వ ఆసుప త్రులలో ప్రసవం అయ్యేందుకు ప్రోత్సహించాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులను మందులు సక్రమంగా వాడేలా చూడాలన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫెర్‌ చేయాలని తెలిపారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, శ్రీరాములు, సుధాకర్‌ రెడ్డి, వైద్యాధికారులు శ్రవణ్‌ కుమార్‌, ఉదయ్‌, ఆశ నోడల్‌ సూపర్‌ వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశలు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:33 PM