Share News

ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:50 PM

రోడ్డు ప్రమా దాలతో ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతు న్నాయని రామగుండం సీపీఅంబర్‌ కిశోర్‌ఝా అన్నారు. సోమవారం అరైవ్‌, అలైవ్‌ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా సీపీ గోదావరిఖని బీ గెస్ట్‌హౌస్‌ మూలమలుపు నుంచి ఇందారం క్రాస్‌ రోడ్డు వరకు బ్లాక్‌స్పాట్‌లను సందర్శించారు.

ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

కోల్‌సిటీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమా దాలతో ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతు న్నాయని రామగుండం సీపీఅంబర్‌ కిశోర్‌ఝా అన్నారు. సోమవారం అరైవ్‌, అలైవ్‌ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా సీపీ గోదావరిఖని బీ గెస్ట్‌హౌస్‌ మూలమలుపు నుంచి ఇందారం క్రాస్‌ రోడ్డు వరకు బ్లాక్‌స్పాట్‌లను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాజీవ్‌ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగ డం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న ఐల్యాండ్‌లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేడి యం బ్లింకర్స్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు సేఫ్టీ కమి టీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోజు జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన చేస్తున్నట్టు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణమని చెప్పారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు.

ప్రమాద రహిద రామగుండం కమిషన రేట్‌గా నిర్మించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, విద్యార్థులు, యువతకు రోడ్డు భద్ర తపై అవగాహన పెంపొందించడమే కాకుండా ట్రాఫిక్‌ నియమాలను, పాటించాల్సిన నియమాలను స్పష్టం చేస్తున్నట్టు చెప్పారు. ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ఇన్‌స్పె క్టర్‌ రాజేశ్వర్‌రావు, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, రోడ్డు సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు, మంచిర్యాల ట్రాఫిక్‌ ఇన్‌ స్పెక్టర్‌ సత్యనారాయణ, హెచ్‌కేఆర్‌ రోడ్‌ వేస్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:50 PM