Share News

సింగరేణి రక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యం

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:48 PM

సింగరేణిలో రక్షణపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికుల సమస్యలు పరిష్క రించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ విఫలమ య్యాయని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు.

సింగరేణి రక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యం

గోదావరిఖని, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో రక్షణపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికుల సమస్యలు పరిష్క రించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ విఫలమ య్యాయని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ జీడీకే 11ఇంక్లైన్‌లో వెంటిలేటర్‌, రక్షణ చర్యలు విస్మరించారని, పనిముట్ల నాణ్యత లేదని, రక్షణ చర్యలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్మి కులు ప్రమాదానికి గురైతే అంబులెన్స్‌ సౌక ర్యం కల్పించడం లేదని, ప్రమాదం జరిగిన వివరాలు నమోదు చేయకుండా కార్మికులకు ఉచితంగా హాజరు వేస్తామనడం సరైంది కాదన్నారు.

ప్రశ్నించే కార్మికులను అణిచి వేస్తున్నారని, 18సంవత్సరాలుగా ఒక అధికారి తిష్టవేసి కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నాడని, అతని ఆగడాలతో కార్మికులు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కార్మికులు వెంటిలేషన్‌పై ప్రశ్నిస్తే ఎంత వెంటిలేషన్‌ ఉండాలని అధికా రులు కార్మికులను ప్రశ్నిస్తున్నా రని, గాలి సరిగా ఉండక కార్మికులు స్పృహ కోల్పోతున్నా రని, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించకపోతే టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొము రయ్య, చెల్పూరి సతీష్‌, పర్లపల్లి రవి, చల్లా రవీందర్‌రెడ్డి, వాసర్ల జోసఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:48 PM