సింగరేణి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయండి
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:03 AM
సింగరేణి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్‌జీ-1 సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో గోదావరి ఖనిలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, డ్యాన్స్ మస్టర్లు, సేవాసమితి సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
గోదావరిఖని, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్‌జీ-1 సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో గోదావరి ఖనిలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, డ్యాన్స్ మస్టర్లు, సేవాసమితి సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 23న జరిగే వేడుకలను వైభవంగా నిర్వహించను న్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ షో, ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తు న్నట్టు చెప్పారు. 20న జీఎం కాలనీ గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలపై రిహార్సల్స్ ఉంటా యని, ఇందులో ఎంపికైన వారిని ప్రధాన వేడుకలకు పంపిస్తామని, 17న గృహ శోభ పోటీలలో ఆర్‌జీ-1 ఉద్యోగుల కంపెనీ క్వ్టార్టర్లు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని, అదే రోజు సాయంత్రం 3గంటలకు సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో వెల్‌బేబి షో పోటీలు నిర్వహిస్తామని, 5సంవత్సరాలలోపు పిల్లలు పోటీల్లో పాల్గొనుటకు అర్హులని, పాల్గొనేవారు హాస్పిటల్ బుక్, ఎంప్లాయి ఐడీ కార్డు తీసు కుని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 19న మధ్యాహ్నం 3గంటలకు సింగరేణిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు, గృహిణిలకు, వారి పిల్లలకు, యువతులకు సింగరేణి ప్రభా విత, పరిసర ప్రాంత మహిళలకు ఆటల పోటీ లను జీఎం కాలనీ గ్రౌండ్స్‌లో నిర్వహించను న్నట్టు తెలిపారు. సాయంత్రం 5గంటలకు దీపాలంకరణ, సింగరేణి ఉద్యోగుల సతీమ ణులకు, వారి పిల్లలకు పరిసర ప్రాంత మహి ళలకు ఈ పోటీలు నిర్వహించనున్నట్టు, 23న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. పర్సనల్ మేనేజర్ రవీంద ర్‌రెడ్డి, సేవా కో ఆర్డినేటర్ హను మంతరావు, సెక్రటరీ బీనాసింగ్, రజిత, సేవా సమితి కో ఆర్డినేటర్ మేడి తిరుపతి పాల్గొన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్ర జ్యోతి): సింగరేణి ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆర్జీ-2 యాజమాన్యం మహిళలకు ఆటల పోటీలు, దీపాలంకరణ పోటీలను నిర్వహించనున్నట్టు ఏరియా అధి కార ప్రతినిధి అరవిందరావు ప్రక టనలో పేర్కొన్నారు. ఈనెల 15న ఉదయం 9గంటలకు సీఈఆర్ క్లబ్‌లో ఉద్యోగుల కుటుం బాలకు చెందిన మహిళలు, స్థానిక మహి ళలకు ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలి పారు. సాయంత్రం 4గంటలకు జీఎం ఆఫీస్ ఆవరణలో మహిళా ఉద్యోగిని లకు, 16వ తేదీ ఎన్‌సీఓఏఐ క్లబ్‌లో అధికారుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఆటల పోటీలు ఉంటాయని తెలిపారు. 17వ తేదీ సాయంత్రం అబ్దుల్ కలాం స్టేడియంలో మహిళలకు దీపాలంకరణ పోటీలను నిర్వ హించనున్నట్టు అరవిందరావు ప్రకటనలో పేర్కొన్నారు.