Share News

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - May 03 , 2025 | 11:55 PM

రాజీ మార్గమే రాజ మార్గమని, జూన్‌ 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి టీ శ్రీనివాసరావు కోరారు. శనివారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

కోల్‌సిటీ, మే 3(ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజ మార్గమని, జూన్‌ 14న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి టీ శ్రీనివాసరావు కోరారు. శనివారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో రాజీకాగల నేరాలు, గృహ హింస, వరకట్న కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలన్నారు. ఆ దిశగా స్టేషన్ల వారీగా కేసులను గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించారు. గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పరిధిలోని కేసులను రాజీ చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. న్యాయమూర్తులు సూరజ్‌సింగ్‌, వెంకటసచిన్‌రెడ్డి, గురువ వెంకటేష్‌, స్వరిక, ఏజీపీలు శంతన్‌ కుమార్‌, కిషన్‌రావు, సౌజన్య, ఏపీపీ పర్హీన్‌, ఏసీపీ మడత రమేష్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:55 PM