Share News

మెగా జాబ్‌మేళాను విజయవంతం చేయండి

ABN , Publish Date - May 13 , 2025 | 11:33 PM

రామగుండంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాల కోసం తలపెట్టిన జాబ్‌ మేళాను విజయ వంతం చేయాలని ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్‌జీ-1 కమ్యూనిటీ హాల్‌ లో ఈ నెల 18న వంద కంపెనీలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రానున్నాయని, ఆర్‌జీ-1, 2, 3 ఏరియాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి 10వేల మంది నిరుద్యోగులు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటారని చెప్పారు.

మెగా జాబ్‌మేళాను విజయవంతం చేయండి

గోదావరిఖని, మే 13 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాల కోసం తలపెట్టిన జాబ్‌ మేళాను విజయ వంతం చేయాలని ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్‌జీ-1 కమ్యూనిటీ హాల్‌ లో ఈ నెల 18న వంద కంపెనీలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రానున్నాయని, ఆర్‌జీ-1, 2, 3 ఏరియాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి 10వేల మంది నిరుద్యోగులు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటారని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం, ఆర్‌జీ-1 కమ్యూనిటీహాల్‌ను ఎంపిక చేశామన్నారు. షామియానాలు, తాగునీరు, హెల్ప్‌డెస్క్‌ సెంటర్లు, రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌సింగ్‌, డీజీఎం(పర్సనల్‌) కిరణ్‌బాబు, ఆంజనేయ ప్రసాద్‌, జితేందర్‌సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:33 PM