Share News

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:29 PM

రాజీమార్గమే రాజమార్గంగా డిసెంబర్‌ 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

గోదావరిఖని, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజీమార్గమే రాజమార్గంగా డిసెంబర్‌ 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు శనివారం అదనపు జిల్లా న్యాయస్థానం ఆధ్వర్యంలో సబ్‌ డివిజన్‌, న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటే ఒకరు గెలిచి, ఒకరు ఓడినట్టు కాదని, క్రిమినల్‌ కేసులు, మోటార్‌ వాహన బీమా కేసులు, గృహ హింస, వరకట్న వేధింపుల కేసులలో రాజీ కుదుర్చుకునేందుకు అందరూ ముందుకురావాలన్నారు. సివిల్‌ సీనియర్‌ జడ్జి జీవన్‌ సూరజ్‌సింగ్‌, మున్సిఫ్‌ మెజిస్ర్టేట్లు వెంకటేష్‌ దుర్వ, స్వారిక, ఏజీఎం శంతన్‌ కుమార్‌, పీపీ పద్మజ, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, ప్రవీణ్‌ కుమార్‌, రాజుగౌడ్‌, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:29 PM