Share News

చలో కొత్తగూడెం విజయవంతం చేయండి

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:49 PM

సి గరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 2న తలపెట్టిన చలో కొత్తగూడెంను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామమూర్తి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నూనె కొమురయ్య పిలుపునిచ్చారు.

చలో కొత్తగూడెం విజయవంతం చేయండి

గోదావరిఖని, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): సి గరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 2న తలపెట్టిన చలో కొత్తగూడెంను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామమూర్తి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నూనె కొమురయ్య పిలుపునిచ్చారు. ఆదివారం టీబీజీ కేఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ

ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు హామీలను మరిచి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మిక సమస్యలను గాలికొదిలేసాయని, కొత్త హక్కులను సాధించడం మరిచి ఉన్న హక్కుల ను యాజమాన్యానికి తాకట్టు పెడుతుందని, దీనిపై ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకు లను నిలదీయాలని, వాస్తవ లాభాలపై 35 శా తం వాటాను ప్రకటించాలని, కార్మికులకు ఆదా య పన్ను రద్దు చేయాలని, అలవెన్సులపై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత నెలలో మెడికల్‌ బోర్డుకు వెళ్లిన 50మంది ఉద్యోగులను ఫిట్‌కు పంపారని, వారిని మళ్లీ బోర్డుకు పిలిచి ఇన్‌వ్యాలిడేషన్‌ చేయాలని, వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని, మెడికల్‌ బోర్డు అన్‌ఫిట్‌ కాలపరిమితిని 36 నెల లకు పెంచాలని, కొత్త బదిలీల పాలసీని రద్దు చేయాలని, మెడికల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు రవి, వడ్డేపల్లి శంకర్‌, చెల్పూరి సతీష్‌, పొలాడి శ్రీనివాసరావు, శేషగిరి, జావిద్‌పాషా, అంజయ్య, కళాధర్‌రెడ్డి, సాయిచరణ్‌, మురళీ, పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:49 PM