ఉపాధిహామీకి మహాత్మ గాంధీ పేరును తొలగింపు
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:27 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పేరిట గ్రామాల్లో ఉన్న వారికి ఉపాధి కల్పిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మహాత్మాగాంధీ జయంతి ఉపాధి హామి పథకం పేరు మార్చి మహాత్మాగాంధీని కించపర్చడం సరైంది కాదన్నారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, యధావిధిగా మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాష్, కొప్పుల శంకర్, నాయిని ఓదెలు, దూళికట్ట సతీష్, బాల రాజ్‌కుమార్, రవి, గుండేటి శంకర్, గడ్డం శ్రీనివాస్, నజీమోద్దీన్, దాసరి సాంబమూర్తి, మాలెం మధు, గడ్డం కృష్ణ, గఫూర్, అల్లి శంకర్, మొహిద్ సన్ని పాల్గొన్నారు.