ప్రారంభమైన మహాసుదర్శన, రాజశ్యామల మహోత్సవాలు
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:46 PM
గోదావరిఖని లోని సత్యసాయి మందిరం ప్రాంగణంలో సోమవారం వైభవంగా మహాసుదర్శన, రాజశ్యామల దేవి త్రయా హ్నిక యజ్ఞ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. లోకకలా ణార్ధం రాష్ర్టీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, రాజశ్యామల దేవి ఉపాసకులు తూడి శ్రావణ్ కుమార స్వామిజీ ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, యజ్ఞోపవీత, దీక్షాకంకణ ధారణ, బ్రహ్మకలశస్థాపన, రుద్ర హోమం నిర్వహిం చారు. దేశ నలుమూలల నుంచి వివిధ పీఠాధిపతులు హాజరయ్యారు.
కోల్‌సిటీటౌన్, జూలై 21(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని లోని సత్యసాయి మందిరం ప్రాంగణంలో సోమవారం వైభవంగా మహాసుదర్శన, రాజశ్యామల దేవి త్రయా హ్నిక యజ్ఞ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. లోకకలా ణార్ధం రాష్ర్టీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, రాజశ్యామల దేవి ఉపాసకులు తూడి శ్రావణ్ కుమార స్వామిజీ ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, యజ్ఞోపవీత, దీక్షాకంకణ ధారణ, బ్రహ్మకలశస్థాపన, రుద్ర హోమం నిర్వహిం చారు. దేశ నలుమూలల నుంచి వివిధ పీఠాధిపతులు హాజరయ్యారు. రాజరాజేశ్వర పీఠాధిపతి అంబికేశ్వర నందస్వామి, త్రిశక్తి షణ్ముఖనందస్వామి, కరుణానంద గిరిస్వామి, శ్రీమాతా మహేశ్వరి, అభినవ కళ్యాణనంద భారతస్వామి, రాఘవేంద్ర స్వామిలు, అధిక సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు. త్రిశక్తి మాత స్వచ్ఛం ద సేవా సమితి సభ్యులు అరవింద్, కోమళ్ళ మహేష్, మచ్చ విశ్వాస్, మీసాల కృష్ణ, కుమారస్వామి, అమ్మ రాజు, మల్లేశ్వర్‌రావు, శంకరయ్య, సునీల్ పాల్గొన్నారు.
నేడు మహాసుదర్శన యాగం, కుంకుమార్చన
మంగళవారం ఉదయం మండప పూజలు, మహా సుదర్శన యాగం, నివేదన, మంత్రపుష్పం, ఆశీర్వచనం మహిళలచే కుంకుమార్చన జరుగుతాయని నిర్వాహ కులు తూడి శ్రావణ్‌కుమారస్వామి తెలిపారు.