రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:02 PM
మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 జడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలు, 263 సర్పంచ్, 2432 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 30 (ఆఽంధ్రజ్యోతి): మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 జడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలు, 263 సర్పంచ్, 2432 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ కాగా, వాటికి సంబంధించిన గెజిట్‌ను విడుదల చేశామని పేర్కొన్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబరు 9వ తేదీన జారీ కానున్నదని పోలింగ్ 23న జరగనున్నదని తెలిపారు. రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల్లోని అంతర్గాం, పాలకుర్తి, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, ధర్మారం మండలాల్లోని 7 జడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వీటి కోసం 362 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబరు 13న నోటిఫికేషన్ జారీ కానున్నదని, 27వ తేదీన పోలింగ్ జరగనున్నదన్నారు. ఈ విడతలో పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని 6 జడ్పీటీసీ స్థానాలు. 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. వీటి కోసం 372 పోలింగ్ స్టేషన్లను ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ఫేజ్ 2, ఫేజ్ 3లో నిర్వహిస్తున్నామన్నారు. ఫేజ్ 2 ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 21న జారీ కానున్నదని, పోలింగ్ నవంబర్ 4న నిర్వహిస్తామని తెలిపారు. అంతర్గాం, పాలకుర్తి, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, ధర్మారం మండలాల్లోని 135 సర్పంచ్ స్థానాలు, 1224 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఫేజ్ 3 ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 25న జారీ కానున్నదని, పోలింగ్ నవంబర్ 8వ తేదీన జరగనున్నదని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని 128 సర్పంచ్, 1208 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల అధికారుల, నోడల్ అధికారులను నియమించామన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందని, పకడ్బందీగా కోడ్‌ను అమలు చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జడ్పీ సీఈఓ నరేందర్, డీపీఓ వీరబుచ్చయ్య పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్ డీసీపీ కరుణాకర్, సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లాలో రెండు విడతల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో పాలకుర్తి, అంతర్గాం, మంథని, ముత్తారం, కమాన్‌పూర్, రామగిరి, ధర్మారం మండలాల్లో, రెండో విడతలో పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలను ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా పేజ్ 2, ఫేజ్ 3లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు ఏమైనా ప్రకటనలు ఇవ్వాలంటే సంబంధిత ఆర్డీవోల అనుమతి పొందాలని, ఏమైనా సమస్యలు ఉంటే మండల స్థాయిలో ఎంపీడీవోలను, జిల్లా స్థాయిలో జడ్పీ సీఈఓ, డీపీఓలను సంప్రదించాలని అన్నారు. జడ్పీ సీఈఓ నరేందర్, డీపీఓ వీర బుచ్చయ్య, వివిధ పార్టీల నాయకులు శశిభూషణ్, అక్కపాక తిరుతి, ఉప్పు రాజుకుమార్, తదితరులు పాల్గొన్నారు.