Share News

లక్ష్యం మేరకు మహిళా సంఘాలకు రుణాలు

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:45 PM

నిర్దేశిత లక్ష్యం ప్రకారం మహిళా సంఘా లకు బ్యాంకు లింకేజ్‌ రుణాలు వంద శాతం మంజూరు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరే ట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మహిళా సంఘాలకు స్ర్తీనిధి, బ్యాంకు లిం కేజీ రుణ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

లక్ష్యం మేరకు మహిళా సంఘాలకు రుణాలు

పెద్దపల్లి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నిర్దేశిత లక్ష్యం ప్రకారం మహిళా సంఘా లకు బ్యాంకు లింకేజ్‌ రుణాలు వంద శాతం మంజూరు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరే ట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మహిళా సంఘాలకు స్ర్తీనిధి, బ్యాంకు లిం కేజీ రుణ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. స్వశక్తి మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు ఎన్‌పీఏ కాకుండా వంద శాతం రుణ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో మహిళా సంఘాల సభ్యులు ఉంటే ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయల రుణం అందించాలన్నారు.

ఈ నెల 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై కలెక్ట రేట్‌లో టామ్‌ కామ్‌ ద్వారా అవగాహన సదస్సును నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకునేలా ప్రచారం కల్పించాల న్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు డీఆర్‌డీఓ రవీందర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:45 PM