Share News

ముగిసిన మద్యం టెండర్లు

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:48 PM

జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. 74 ఏ4 షాపులకు 1507 దరఖాస్తులు రాగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె అరుణశ్రీ డ్రా ద్వారా లైసెన్స్‌ దారులను ఎంపిక చేశారు. ఈ టెండర్లలో 15 మద్యం షాపులను మహిళలు దక్కించుకొన్నారు.

ముగిసిన మద్యం టెండర్లు

పెద్దపల్లి, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. 74 ఏ4 షాపులకు 1507 దరఖాస్తులు రాగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె అరుణశ్రీ డ్రా ద్వారా లైసెన్స్‌ దారులను ఎంపిక చేశారు. ఈ టెండర్లలో 15 మద్యం షాపులను మహిళలు దక్కించుకొన్నారు. రెండేళ్లకు గాను మద్యం లైసెన్సుల ద్వారా 86 కోట్ల 60 లక్షలు, దరఖాస్తుల రూపేణా 45 కోట్ల 21 లక్షలు, మొత్తం 131 కోట్ల 81 లక్షల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనున్నది. జనాభా ప్రాతిపదికన స్లాబ్‌ల ప్రకా రం ఫీజు వసూలు చేయనున్నారు. 12 షాపులు 50 లక్షలు, 24 షాపులు 55 లక్షలు, 12 షాపులు 60 లక్షలు, 26 షాపులు 65 లక్షలు వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉం టుంది. సోమవారం పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బంధంపల్లిలో గల స్వరూప గార్డెన్‌లో డ్రా ద్వారా మద్యం షాపులను ఖరారు చేశారు. పెద్దపల్లి సర్కిల్‌ పరిధిలోని 20 షాపులకు 442, సుల్తానాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని 15 షాపులకు 305, రామగుండం సర్కిల్‌ పరిధిలోని 24 షాపులకు 474, మంథని సర్కిల్‌ పరిధి లోని 15 షాపులకు 286 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపు వారీగా దరఖాస్తుల సంఖ్యను బట్టి టోకెన్లను వ్యాపారులకు చూపెట్టి డబ్బాలో వేసి టోకెన్‌ తీసి లైసె న్స్‌దారులను ఎంపిక చేశారు. ఫొటో, వీడియో చిత్రీ కరణ నిర్వహించారు. షాపులు దక్కిన వారు కేరింతలు కొట్టగా, దక్కని వాళ్లు నిరాశకు గురయ్యారు. 74 షాపు ల్లో 15 షాపులు మహిళలకు, 59 షాపులు పురుషులకు దక్కాయి. డ్రా అనంతరం మద్యం షాపులను దక్కించు కున్న వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్‌ టాక్స్‌ వార్షిక పన్నులో 6వ వంతు చెల్లించి లెటర్‌ తీసుకోవా లని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 2027 నవంబర్‌ 30వ వరకు కొత్త షాపులు అమల్లో ఉంటాయన్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌ రెడ్డి, దరఖాస్తు దారులు, ఎక్సైజ్‌ శాఖ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 11:49 PM