Share News

మట్టి గణపతులను పూజిద్దాం

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:47 AM

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలనే పోస్టర్లను ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

 మట్టి గణపతులను పూజిద్దాం

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలనే పోస్టర్లను ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని, పలు కూడళ్లు, బస్టాండ్‌, జనసంచారం ఉన్న ప్రదేశాలల్లో వాల్‌ పోస్టర్లను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.

కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తూ పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీవోపీతో తయారు చేసిన గణపతుల వల్ల నీటి, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. నీటిలో జీవించే ప్రాణుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చని వివరించారు. కలెక్టర్‌ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ బిక్షపతి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ బండి ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:47 AM