సింగరేణిని రక్షించుకుందాం...
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:53 PM
సింగరేణిని రక్షించుకోవడా నికి ఐక్య పోరాటాలు నిర్మిద్దామని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదంరాంతోపాటు పలు వురు నాయకులు మాట్లాడారు.
గోదావరిఖని, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సింగరేణిని రక్షించుకోవడా నికి ఐక్య పోరాటాలు నిర్మిద్దామని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదంరాంతోపాటు పలు వురు నాయకులు మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకులను అమ్మకాలకు పెట్టడం, కొత్త గనులు రాకుండ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటు న్నాయని అభిప్రాయపడ్డారు. వేల కోట్ల లాభాలతో నడుస్తున్న సింగ రేణిలో కొత్త బావులు, ఉద్యోగాల కల్పనకు అడ్డేమిటని కోదండరాం అన్నారు. సింగరేణిని రక్షించుకోవడంతోపాటు కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అమలు చేసేందుకు కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోల్‌బెల్ట్ ప్రాంత శాసనసభ్యులు సింగరేణిని రక్షించుకునేందుకు క్రియాశీలంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
వేల కోట్ల రూపాయల లాభాలను యాజమాన్యం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. గోదావరి తీర ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పూనుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికుల కుటుంబాలను, గోదావరిఖని ప్రాంతంలో ఉన్న ప్రజలను, పల్లెలను కాపాడాలన్నారు. సింగరేణి బచావో ఉద్యోమంలో ప్రజలందరూ పాల్గొనాలని, కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్, మాదాసు రామమూర్తి, కామెర గట్టయ్య, రత్నాకర్‌రావు, రాజమౌళి, కే విశ్వనాథ్, రాములు, తోకల రమేష్ మాట్లాడారు.