Share News

రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:52 PM

రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చెప్పారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే స్కూటీపై సిక్కువాడ, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, మల్లికార్జున్‌నగర్‌లలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా

కోల్‌సిటీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చెప్పారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే స్కూటీపై సిక్కువాడ, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, మల్లికార్జున్‌నగర్‌లలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ధేశించిన ప్రజాపాలనను ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రజల వద్దకే వెళుతూ వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రామగుండం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతు న్నట్టు, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, కార్పొరేషన్‌లో ప్రతి డివిజన్‌లో రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు, విద్యుత్‌ దీపాలు, మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్పారు.

అభివృద్ధి కోసం తాను చేస్తున్న ప్రయత్నానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల సమస్యలను నెరవేర్చడమే ధ్యేయమ న్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, రామగుండం అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చినట్టు చెప్పారు. చౌరస్తాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌, తాళ్లపల్లి యుగంధర్‌ ఉన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:52 PM