Share News

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:31 PM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు. జిల్లా 4వ మహాసభలు పట్టణంలోని ఎం.బి.గార్డెన్‌ ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి జెండావిస్కరణ చేశారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 17 (ఆంఽధ్రజ్యోతి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు. జిల్లా 4వ మహాసభలు పట్టణంలోని ఎం.బి.గార్డెన్‌ ఏర్పాటు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి జెండావిస్కరణ చేశారు. మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూపాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మరోరకంగా వ్యవహరిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ యాజమాన్యాలకు, పైవ్రేటు, కార్పోరేట్‌ వ్యక్తులకు ఊడిగం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థల్ని పైవ్రేట్‌ పరం చేస్తున్నారని, ఇవన్నీ మెడీ అనుచరులైన ఆదాని, అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. జిల్లా కార్యదర్శి ఎ.ముత్యం రావు, డీ.కొమురయ్య, జ్యోతి, బిక్షపతి, రవీందర్‌, అరవింద్‌, రామాచారి, అంజయ్య, వనాజా రాణి, గణేష్‌, సారయ్య, నర్సయ్య, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:31 PM