Share News

ఐక్యతతో హక్కులు సాధించుకుందాం

ABN , Publish Date - Aug 04 , 2025 | 11:53 PM

సింగరేణిలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గ ఉద్యోగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో సాధించుకుందామని సింగరేణి బీసీ ఎం ప్లాయిస్‌ అసోసియేషన్‌ నాయకులు పేర్కొ న్నారు. సోమవారం ఎన్‌సీఓఏ క్లబ్‌లో ఆర్జీ-2 ఏరియా బీసీ ఉద్యోగుల సమావేశం జరి గింది.

ఐక్యతతో హక్కులు సాధించుకుందాం

యైుటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 4 (ఆంధ్ర జ్యోతి): సింగరేణిలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గ ఉద్యోగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో సాధించుకుందామని సింగరేణి బీసీ ఎం ప్లాయిస్‌ అసోసియేషన్‌ నాయకులు పేర్కొ న్నారు. సోమవారం ఎన్‌సీఓఏ క్లబ్‌లో ఆర్జీ-2 ఏరియా బీసీ ఉద్యోగుల సమావేశం జరి గింది. నాయకులు మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు చట్టబద్దంగా దక్కా ల్సిన ప్రయోజనాలు అందడం లేదన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్‌గా భావించే రోజులు పోయాయని, సామా జికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్య వంతమైనట్టు పేర్కొన్నారు. సింగరేణిలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పార్టీలు, కార్మిక సంఘాలకు సంబంధం లేకుండా కలిసికట్టుగా పని చేయాల్సిన అవ సరం ఉన్నట్టు నాయకులు అభిప్రాయ పడ్డారు. ఇతర సామాజిక వర్గాలు అసోసి యన్లుగా ఆయా వర్గాలు ప్రయోజనం పొం దుతున్నాయని తెలిపారు. విస్తృత ప్రయో జనాలు పొందాలంటే సంఘటితంగా నిలవాలని, రానున్న రోజుల్లో అసోసియేషన్‌ బలోపేతం చేసుకుంటూ చట్టబద్దంగా రావా ల్సిన ప్రయోజనాలు పొందే దిశగా ఉద్యోగు లు కలిసి రావాలని అసోసియేషన్‌ నాయ కులు కోరారు. అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దీటి చంద్రమౌళి, నాయకులు, ఉద్యోగులు మురళీకృష్ణ, జిగురు రవీందర్‌, అయిలి శ్రీనివాస్‌, సాలిగామ మల్లేష్‌, రవికిరణ్‌, సంపత్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 12:04 AM