ఐటీఐలో న్యాయ విజ్ఞాన సదస్సు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:54 PM
జిల్లా కేంద్రంలోని స్థానిక ఐటీఐలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేంద్రంలోని స్థానిక ఐటీఐలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. సోషల్ మీడి యాలో అసభ్యకర పోస్టులు పెట్టడం వల్ల విధించే శిక్షలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహ నం నడపడం, తెలియని వారు ఇచ్చే పార్సిల్ కవ ర్లు తీసుకెళ్లడం వల్ల జరి గే అనర్థాలకు విధించే శిక్ష లను వివరించారు. ఇలాం టి వాటి జోలికి పోకుండా యువత ఉన్నత భవి ష్యత్‌కు బాటలు వేసుకో వాలని కోరారు.
ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే 15100కి ఫోన్ చేయాలని, ప్రతి న్యాయస్థానంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుంద న్నారు. న్యాయవాదులు నుచ్చు శ్రీనివాస్, శరత్ కుమార్, ఝాన్సీ, నరేష్ పాల్గొన్నారు.