లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:55 PM
మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం ఆవర ణలో ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహా త్మా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి ఉష మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ సేవలు మరువలేనివన్నారు. వారి ఆశయ సాధ నతో పద్మశాలి సంఘం అభివృద్ధికి ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం ఆవర ణలో ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహా త్మా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి ఉష మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ సేవలు మరువలేనివన్నారు. వారి ఆశయ సాధ నతో పద్మశాలి సంఘం అభివృద్ధికి ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సంఘం మండల అధ్యక్షుడు సబ్బని రాజమల్లు, మండల ప్రధాన కార్యదర్శి బైరి రాజీ వీరు, నాయకులు ఆడేపు రాజు, గోలి సుధాకర్, బైరి కుమారస్వామి, గోలి రమణయ్య, సంపత్ కుమార్, సబ్బని శంకర్, ఒడ్నాల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, గోలి కేశవులు, గుడ్ల శ్రీనివాస్, రాజమౌళి, పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): శాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్క రించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోట రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నివాళులర్పించి ఆయన సేవల ను గుర్తుకు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షుడు నల్లవెల్లి శంకర్, పెంచిల్‌పేట మాజీ సర్పంచ్ వెం కటేష్, మాజీ వైస్ ఎంపీపీ కొట్టే భూమయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మిమల్లు, పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ఆచార్య కొండాలక్ష్మన్‌బాపూజి వర్ధంతి బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మన్‌బాపూజి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్ కమిటి మాజీ చైర్మెన్ పాటకుల అనిల్, ఏదుల్ల కనుకయ్య, కోడూరి మహేష్, నగునూరి నారాయణ, తిరుపతి, కొండ రవిందర్, అందె మల్లేశం, వెంగళ వెంకటేశం పాల్గొన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): దొంగతుర్తి పద్మశాలి సంఘ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ వర్ధం తి నిర్వహించారు. స్వాతంత్ర పోరాటంతో పాటు నిజాం నిరంకుశ పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం చేసి ఉద్యమాల ఊపిరిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిలిచారని పద్మశాలి సంఘ నాయకులు ఎన్నం రమేష్ అన్నారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.