భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:11 AM
భూ భారతి కింద వచ్చిన ధరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భూ భారతి కింద వచ్చిన ధరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతు సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి ఇచ్చినందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను సిద్ధం చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పరిష్కరించాలని, ఆసైన్డ్ భూములకు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. తహసీల్దార్ బషీరొద్దిన్, అధికారులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి కావాలి
పెద్దపల్లిటౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కంటే ముందుగానే జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్లు, వనమహోత్సవంపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు మార్కింగ్ పెండింగ్ లో ఉందన్నారు. మార్కింగ్ పూర్తి చేసిన లబ్ధిదారులంతా నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. మార్కింగ్ చేసిన ఇండ్లు బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు, కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. పెట్టుబడి సమస్య ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలని, ఇండ్లు నిర్మించుకోవడంలో అలసత్వం వహిస్తే మంజూరు చేసిన ఇండ్లు రద్దు చేయాలని పేర్కొన్నారు. వన మహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కకు కర్ర, ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కల జియో ట్యాగింగ్ చేయాలని, బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గ్రామాల్లో రెగ్యులర్ గా ఫాగ్గింగ్ చేయాలని సూచించారు. వర్షాల తర్వాత సీజనల్ వ్యాధుల వ్యాప్తి అధికం అవుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండటానికి వీలు లేదన్నారు. పీడి హౌసింగ్ రాజేశ్వర్ రావు, జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపిడిఓ లు, అధికారులు పాల్గొన్నారు.