అభ్యంతరాల పరిష్కారం తర్వాతే భూసేకరణ
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:07 AM
అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్ సర్వే ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
పెద్దపల్లి రూరల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్ సర్వే ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం బైపాస్ రోడ్డు మంజూరు చేసిందని, బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసర మైన భూ సేకరణ నిమిత్తం ఎంజాయిమెంట్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించిన తర్వాతే భూ సేకరణ జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని, మెరుగైన పరిహారంతో రైతులను ఒప్పించిన తర్వాతే భూ సేకరణ జరుగుతుందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్‌అండ్‌బి భావ్‌సింగ్, ఇన్‌ఛార్జి తహసీల్దార్ విజేందర్, సర్వేయర్‌లు, అధికారులు, పాల్గొన్నారు.