Share News

స్వరాష్ట్ర సాధనకు కృషి చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:53 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అలుపెరుగని పోరాటం చేశారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడు కల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటం, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోరాటం చేశారన్నారు.

స్వరాష్ట్ర సాధనకు కృషి చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అలుపెరుగని పోరాటం చేశారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడు కల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటం, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోరాటం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు 1969 ఉద్యమ సమయంలో మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారన్నారు. ఆయన సేవలను గు ర్తించిన రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, వెనుక బడిన తరగతుల అభి వృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): స్వరాష్ట్ర సాధనకు కొండ లక్ష్మణ్‌బాపూజీ అలుపెరుగని పోరాటం చేశాడని రామ గుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా కమిషనరేట్‌లో నివా ళులర్పిం చారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఇంటిని, ఆస్తులను దానం చేశారని, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలు పోరాటం చేసి దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండ లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమేష్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఐలు దామోదర్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, సీసీ హరీష్‌ పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): చేనేత సహకార సంఘంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేశారు. పలువురు నాయకులను సన్మానించారు. నిర్వాహకులు మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, ఓదెల ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, మిట్టపల్లి మురళీధర్‌, ఐల రమేష్‌, సాయి రి మహేందర్‌, గుండా మురళి, రాజేంద్ర ప్రసాద్‌, పద్మశాలి కులబాంధవులు పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ జయంతి జరుపు కున్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, మేరుగు సారంగం, ఖ్యాతం వెంకటేశ్వర్లు, మేరుగు భీష్మచారి, రాజేంద్రప్రసాద్‌, పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): లక్ష్మణ్‌ బాపూజీ జ యంతి సందర్భంగా రాజేష్‌ థియేటర్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారి రాయమల్లు, ప్రధానకార్యదర్శి బూర్ల దామోదర్‌, సిరిమల్ల జయరాములు, మూర్తి, సతీష్‌, పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 11:53 PM