Share News

Prasanna Reddy: హైకోర్టు జడ్జినంటూ ప్రసన్నారెడ్డి మోసాలు

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:45 PM

హైకోర్టు జడ్జిని అంటూ కిలాడి లేడి ప్రసన్నారెడ్డి చేసిన మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రసన్నారెడ్డి డబ్బులు వసూలు చేసినట్టు బహిర్గతమైంది.

Prasanna Reddy: హైకోర్టు జడ్జినంటూ ప్రసన్నారెడ్డి మోసాలు
Prasanna Reddys frauds

ఇంటర్నెట్ డెస్క్: హైకోర్టు జడ్జిని అంటూ కిలాడి లేడి ప్రసన్నారెడ్డి చేసిన మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రసన్నారెడ్డి డబ్బులు వసూలు చేసినట్టు బహిర్గతమైంది. నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేసిన ప్రసన్నరెడ్డి.. జడ్జినంటూ మోసం చేసి వేములవాడ ఆలయంలో ప్రత్యేక దర్శనం కూడా చేసుకుంది. ప్రసన్నరెడ్డి జడ్జి కాదని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. దీంతో ఆమెను కరీంనగర్‌లో మధురానగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

Prasanna-Reddy.gif


పలు సందర్భాల్లో నిరుద్యోగుల్ని టార్గెట్ చేసిన ప్రసన్నారెడ్డి పలువురిని నమ్మించింది. డబ్బులిస్తే.. హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పింది. ఇలా దాదాపు 100 మందికి పైగా అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. తాజాగా ప్రసన్నా రెడ్డి తాను హైకోర్టు జడ్జినంటూ డ్యూటీలో ఉన్న సీఐ (CI)ని బురిడి కొట్టించి వేములవాడ (Vemulawada) ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది. చివరికి ఉద్యోగాల పేరుతో మోసపోయిన వారంతా ప్రసన్నా రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికొచ్చింది. దీంతో ఇవాళ ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుముందు హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. హైకోర్టు జడ్జి ముసుగులో ఇంకా ప్రసన్నారెడ్డి ఎలాంటి తతంగం నడిపిందనే దానిపై ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:58 PM