Share News

రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్‌ చరిత్ర ఉంటుంది

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:27 AM

రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్‌ చరిత్ర ఉంటుందని, ఉద్య మకారులపై గన్‌ ఎక్కు పెట్టిన చరిత్ర సీఎం రేవంత్‌ రెడ్డిదని, ఉద్యమంలో పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఎక్కడ ఉన్నాడోనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శనివారం పెద్దపల్లిలో దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్‌ చరిత్ర ఉంటుంది

పెద్దపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్‌ చరిత్ర ఉంటుందని, ఉద్య మకారులపై గన్‌ ఎక్కు పెట్టిన చరిత్ర సీఎం రేవంత్‌ రెడ్డిదని, ఉద్యమంలో పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఎక్కడ ఉన్నాడోనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శనివారం పెద్దపల్లిలో దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్ర మంలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ నవంబరు 29 అంటే ఒక చరిత్ర అని, ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన పద్నాలుగేళ్ల సమరమే తెలంగాణ పోరాటం అని గుర్తు చేశారు. 2009 నవంబరు 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ నుంచి సిద్ధిపేట రంగదాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి కేసీఆర్‌ బయల్దేరారని, కరీం నగర్‌ అల్గునూరు చౌరస్తాలో పోలీసులు చుట్టు ముట్టారని తెలిపారు. కేసీఆర్‌ రోడ్డు మీదే దీక్షకు కూర్చున్నా బలవంతంగా ఖమ్మం జైలుకు తరలిం చారని అన్నారు. చరిత్ర చెరిపితే చెరిగేది కాదని ఈశ్వర్‌ అన్నారు.

కేసీఆర్‌ సర్కార్‌ తర్వాత ప్రజాపా లన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపాన్నే మార్చారని, బతుకమ్మ చీరలకు రాంరాంపెట్టి ఇందిరమ్మనే తెలంగాణ తల్లిగా ముందుకు తెస్తున్నారని విమర్శించారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానా లన్నీ మాటతప్పా యని, 6 గ్యారెంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారని మండిప డ్డారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, పుట్ట మధూకర్‌, కోరుకంటి చందర్‌, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌, మూల విజ యరెడ్డి, గంట రాములు, కౌశిక్‌ హరి, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పురాజ్‌ కుమార్‌, నాయకులు వంగల తిరుపతిరెడ్డి, మోహన్‌ రావు, నూనేటి సంపత్‌, సందీప్‌ రావు, మార్కు లక్ష్మణ్‌, ఐరెడ్డి వెంకట్‌ రెడ్డి, కొయ్యడ సతీష్‌ గౌడ్‌, బోయిని రాజమల్లయ్య, సూర శ్యామ్‌, మైలారం నారాయణ, సలేంద్ర రాములు, తీగల సదయ్య, ముత్యాల రాజ య్య, మేడగోని శ్రీకాంత్‌, మోబిన్‌, పెంచాల శ్రీధర్‌, పూదరి చంద్రశేఖర్‌, కార్తీక్‌, బిక్షపతి, స్వామి, సరేష్‌, ప్రశాంత్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:27 AM