Share News

సంతోష్‌రావును బయటకు పంపేందుకే కేసీఆర్‌ కుటుంబ డ్రామా

ABN , Publish Date - May 31 , 2025 | 11:33 PM

సంతోష్‌ రావును బయటకు పంపేందుకే కేసీఆర్‌ కుటుంబం డ్రామాలు అడుతుందని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శని వారం ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్‌ ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్ర మంలో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబంలో ఆస్తి పంపకాలు, కమీషన్ల దందా విషయం లో కోల్డ్‌వార్‌ నడుస్తుందని, సంతోష్‌రావు ఉన్నంత కాలం తమది నడవదనే నెపంతోనే కవిత ఈ డ్రామాకు తెరలేపిందన్నారు

సంతోష్‌రావును బయటకు పంపేందుకే కేసీఆర్‌ కుటుంబ డ్రామా

ధర్మారం, మే 31 (ఆంధ్రజ్యోతి): సంతోష్‌ రావును బయటకు పంపేందుకే కేసీఆర్‌ కుటుంబం డ్రామాలు అడుతుందని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శని వారం ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్‌ ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్ర మంలో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబంలో ఆస్తి పంపకాలు, కమీషన్ల దందా విషయం లో కోల్డ్‌వార్‌ నడుస్తుందని, సంతోష్‌రావు ఉన్నంత కాలం తమది నడవదనే నెపంతోనే కవిత ఈ డ్రామాకు తెరలేపిందన్నారు. ప్రజా స్వామ్యంలో ఎవరైన పార్టీలు పెట్టుకోవచ్చని, ప్రజల మధ్యకు వెళ్లవచ్చని తెలి పారు.

అసలు కవిత కోసం ఇంత ప్రచార ఆర్భాటం, రాజకీయ రగడ చేయడానికి ఆమె ఏమైన స్వాతంత్య్ర సమరయోధురాలా? తెలం గాణ కోసం పోరాడి జైలుకు వెళ్లిందా? అని ప్రశ్నిం చారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత అంతా ఒకేటేనని, నెలలోపు అందరూ కలు స్తారని జోస్యం చెప్పారు. అనంతరం లబ్ధిదా రులకు చెక్కులు పంపిణీ చేశారు. తహసీ ల్దార్‌ ఎండీ వకీల్‌, ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ లావుడ్య రూప్లానా యక్‌, వైస్‌ చైర్మెన్‌ అరిగె లింగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మెన్‌ కొత్త నర్సింహులు, నాయ కులు సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:33 PM