Share News

దళితులను నమ్మించి మోసం చేసింది కేసీఆరే

ABN , Publish Date - May 31 , 2025 | 11:35 PM

దళి తులను నమ్మించి మోసం చేసింది కేసీఆరేనని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విమర్శించారు. పెద్దాపూర్‌, బాల్‌రాజ్‌పల్లి, కుమ్మరికుంట, కీచులాటపల్లి, కాచాపూర్‌ గ్రా మాల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదా రులకు మంజూరు పత్రాలను అందించి, ఇం డ్లకు ముగ్గులు పోసి పనులను ప్రారంభిం చారు.

దళితులను నమ్మించి మోసం చేసింది కేసీఆరే

జూలపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): దళి తులను నమ్మించి మోసం చేసింది కేసీఆరేనని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విమర్శించారు. పెద్దాపూర్‌, బాల్‌రాజ్‌పల్లి, కుమ్మరికుంట, కీచులాటపల్లి, కాచాపూర్‌ గ్రా మాల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదా రులకు మంజూరు పత్రాలను అందించి, ఇం డ్లకు ముగ్గులు పోసి పనులను ప్రారంభిం చారు. ఆయా గ్రామాల్లో కోటి 35లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి ముఖ్య మంత్రిని దళితులనే చేస్తానని ప్రకటించి అధి కార వ్యామోహంతో దళితులను మోసం చేసి కేసీఆర్‌ గద్దెనెక్కాడని, కేసీఆర్‌ దళితజాతుల వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతాడని విమర్శిం చారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాతున్నట్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒకటేనని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ బీజేపీపై విమర్శలు చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ మాట్లాడు తున్న మాటలు సినిమాలో జోకర్‌లా తలపి స్తున్నాయని, ఆయన మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంద క్రిష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగలు, ఉప కులాలు ఎస్సీ వర్గీకరణకు ముప్పై ఏళ్లుగా చేస్తున్న ఉద్యమా నికి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘన త తమ ప్రభుత్వానికే దక్కు తుందన్నారు. ఎంపిడివో పద్మజ, ఎంపిఓ అనిల్‌రెడ్డి, మార్కె ట్‌ కమిటి చైర్మెన్‌ గండు సంజీవ్‌, మాజి జడ్పిటిసి బొద్దుల లక్ష్మినర్సయ్య, విండో చైర్మెన్‌ వేణు గోపాల్‌రావు, నాయకులు బొజ్జ శ్రీనివాస్‌, నర్సింహాయాదవ్‌, లోక జలపతిరెడ్డి, జెట్టి సతీ ష్‌, రవిందర్‌రావు, బండి స్వామి,కోరికంటి మల్లయ్య, కందుకూరి అంజయ్య, తోట శంకరయ్య, కొట్టె సంజీవ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:35 PM