ఆత్మరక్షణకు కరాటే దోహదం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:33 PM
కరాటే ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని మం డల విద్యాధికారి జింక మల్లేషం అన్నారు. ఆదివారం గోదావరిఖని ఆర్‌సీఓఏ క్లబ్‌లో స్కూల్స్, గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కరాటే ఆత్మరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని మం డల విద్యాధికారి జింక మల్లేషం అన్నారు. ఆదివారం గోదావరిఖని ఆర్‌సీఓఏ క్లబ్‌లో స్కూల్స్, గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని సూచిం చారు. కరాటేతో ఆత్మరక్షణతోపాటు శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఆరోగ్యాన్ని పెం పొందిస్తాయని చెప్పారు.
ప్రభుత్వం పాఠశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణ ఇప్పిస్తుందన్నారు. ఎస్‌జీఎఫ్ కరాటే పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పా ల్గొని జిల్లాకు పతకాలు తీసుకురావాలని పిలుపుని చ్చారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మణ్, వ్యాయా మ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీని వాస్, శోభ, ఫిజికల్ ఎడ్యుకే షన్ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ తగరపు శం కర్, రచ్చ శ్రీనివాస్, కరాటే శ్రీనివాస్, రాజ్‌కుమార్, శం కర్, సురభి అన్వేష్, జావి ద్ కరీంనగర్, జగిత్యాల, సి రిసిల్లా జిల్లాల కరాటే క్రీడా కారులు పాల్గొన్నారు.