కాళేశ్వరం జోన్‌కు పేరు తీసుకురావాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:08 AM
రాష్ట్ర, జాతీ య స్థాయిల్లో జరిగే పోటీల్లో రాణించి కాళేశ్వరం జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొ న్నారు. కమిషనరేట్‌లో జరుగుతున్న కాళ్వేరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను పరిశీలించారు.
కోల్‌సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జాతీ య స్థాయిల్లో జరిగే పోటీల్లో రాణించి కాళేశ్వరం జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొ న్నారు. కమిషనరేట్‌లో జరుగుతున్న కాళ్వేరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను పరిశీలించారు. మొదట పోలీస్ జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నేరస్థలాల్లో బాం బులు, గంజాయి, మాదక ద్రవ్యాలను గుర్తించే విధానాన్ని డాగ్ హ్యాండ్‌లర్స్ సీపీకి వివరించారు. డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్ ద్వారా భూమిలో పాతిపెట్టిన మందు గుండు సామగ్రి, అనుమానా స్పదమైన, ప్రమాదకరమైన ఇనుప వస్తువులను ఏ విధంగా గుర్తి స్తారో బాంబ్ డిస్పోజల్ టీమ్ చేసి చూపించారు.
సీపీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బందిలోని సామర్థ్యం వెలికి తీసేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఎంత గానో ఉపయోగపడుతుందన్నారు. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం చాలా కీలకమ న్నారు. కాళేశ్వరం జోన్ మీట్‌లో 91మంది అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. కంప్యూటర్, ఫొరె న్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్ లిఫ్టింగ్, బాంబుడిస్పోజల్, ఫోటో, వీడి యోగ్రఫీ విభాగాల్లో పోటీలు జరిగాయి. ప్రతిభ కనబరిచిన వారిలో వరంగల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తా మని సీపీ తెలిపారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాబురావు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.