Share News

కాళేశ్వరం కూలిపోయే ప్రాజెక్టు

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:44 PM

మాజీమంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఓ దొంగ అని, ఆయన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కాల్వ లింగస్వామి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాళేశ్వరం కూలిపోయే ప్రాజెక్టు

కళ్యాణ్‌నగర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఓ దొంగ అని, ఆయన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కాల్వ లింగస్వామి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని సూర్యపేటలోని ఓ రైస్‌మిల్లులో కొట్టిన చరిత్ర అందరికీ తెలుసున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెబితే మూడు రోజుల్లో నీటిని నింపి ఎలా వినియోగించాలో చేసి చూపెడుతామని జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, కాళేశ్వరం కూలే ప్రాజెక్టు అని, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరంలో నీళ్లు నింపితే కూలిపోతుందని చెప్పిందని అన్నారు.

కేసీఆర్‌ సొంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, అది ఇప్పుడు కూలిపోయే దశకు చేరుకుందని అన్నారు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు చెక్కు చెదరలేదని, జగదీశ్వర్‌రెడ్డి ఆ ప్రాజెక్టును చూడాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చందర్‌ ఇంట్లో సమావేశం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో తిప్పారపు శ్రీనివాస్‌, గట్ల రమేష్‌, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్‌, గడ్డం శ్రీనివాస్‌, తాళ్లపల్లి యుగంధర్‌, శివ, మిడిదొడ్డి ప్రవీణ్‌, నజీమోద్దీన్‌, పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:44 PM