Share News

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:23 AM

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేయడం వల్లనే తనలాంటి బలహీనవర్గాల వ్యక్తికి మంత్రి పదవి లభించిందని అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మంగళవారం మండలానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికాయి.

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం

ధర్మారం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేయడం వల్లనే తనలాంటి బలహీనవర్గాల వ్యక్తికి మంత్రి పదవి లభించిందని అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మంగళవారం మండలానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికాయి. ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లా నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పత్తిపాక ఎక్స్‌ రోడ్‌ వద్ద స్వాగతం పలికారు. కటికెనపల్లి వద్ద మాజీ ఉప సర్పంచ్‌ రామడుగు గంగారెడ్డి ఆధ్యర్యంలో మంత్రిని గజమాలతో సన్మానించారు. అక్కడి నుంచి ఽధర్మారం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబే డ్కర్‌ విగ్రహానికి పూలవేసిన అనంతరం మంత్రి ప్రసంగించారు. ఒక సామన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్‌ పార్టీ అక్కున చేర్చుకొని ఆదరించిం దన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేయని ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసి చూపించారని తెలిపారు. 10 ఏండ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో ఎస్సీలకు సమన్యాయం జరగలేదని, ప్రతిపక్షంలో ఉండగా తననున ఎన్నో అవమానాలకు గురి చేస్తూ హేళన చేశారని చెప్పారు. 2018 ఎన్ని కల్లో తాను గెలిచినా అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నన్ను ఓడించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ప్రజలంద రికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నిరుద్యో గులకు 59 వేల ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్‌ పార్టేనన్నారు. ఈ స్థానంలో నిలబెట్టిన ప్రజలందరికి ఎల్లవేళల అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. దేవి జనార్దన్‌, కాడె సూర్యానారాయణ, కొత్త నర్సిం హులు, ఈదుల శ్రీనివాస్‌ పుష్పగుచ్ఛాలతో మంత్రికి స్వాగతం పలుకగా, పాలకుర్తి రేణుక దేవి లావణ్య ఆధ్యర్యంలో మంగళహారతులతో అడ్లూరికి స్వాగతం పలికారు.

Updated Date - Jun 11 , 2025 | 12:23 AM