Share News

క్రమబద్ధీకరణ కాకపోవడంతో జేపీఎస్‌ల ఇక్కట్లు

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:01 AM

జిల్లాలో పని చేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్‌ ముగిసినప్పటికీ, సర్వీస్‌ క్రమబద్ధీకరణ కాకపోవడంతో వారు ఇంక్రి మెంట్లు, ఇతర ప్రయోజనాలు కోల్పోతున్నారు.

క్రమబద్ధీకరణ కాకపోవడంతో జేపీఎస్‌ల ఇక్కట్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో పని చేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్‌ ముగిసినప్పటికీ, సర్వీస్‌ క్రమబద్ధీకరణ కాకపోవడంతో వారు ఇంక్రి మెంట్లు, ఇతర ప్రయోజనాలు కోల్పోతున్నారు. క్రమ బద్ధీకరణ చేయాలని మొత్తుకుంటున్నా సంబంధిత పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్త్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు రాక పోవడంతో జిల్లా అధికారులు ఏమి చేయలేకపోతు న్నారని తెలుస్తున్నది.

పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలనే లక్ష్యంతో..

గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసే విధంగా తీర్చిది ద్దడంతో పాటు పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్లు, తాగునీటి సరఫరా, ఇంటింటికి చెత్త సేకరణ, పన్నుల వసూళ్లు, తదితర పనులు సాఫీగా సాగాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతీ గ్రామ పంచా యతీకి ఒక కార్యదర్శి నియమించాలని నిర్ణయించింది. రెగ్యులర్‌ పంచాయతీ కార్యదర్శులకు తోడు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నియమించేందుకు ప్రభు త్వం నియామకాలు చేపట్టింది. ప్రతిభ ఆధారంగా 2019 ఏప్రిల్‌లో నియామకాలను చేపట్టారు. జిల్లాలో సుమారు 190 మంది జేపీఎస్‌లను నియమించగా, ప్రస్తుతం 166 మంది పనిచేస్తున్నారు. అప్పటి ప్రభు త్వం మూడు సంవత్సరాల పాటు వారి పనితీరును పరిశీలించి రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇందుకు నాలుగు సంవత్సరాల కాలం పట్టింది. 2023 ఏప్రిల్‌లో ఒప్పంద కాలం ముగియడంతో అదే ఏడాది ఆగస్టులో పంచాయతీ కార్యదర్శులకు పే స్కేలు వర్తింపజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్‌ ముగిసినప్పటికీ క్రమబద్ధీకరణ చేపట్టలేదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శులు వివిధ బ్యాచుల్లో నియామకం కావడం వల్ల ఎఫెక్టివ్‌ తేదీ ఎప్పటి నుంచి ఇవ్వాలనే విషయమై పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

కామన్‌ ఎఫెక్టివ్‌ డేట్‌ ఇవ్వాలి

అందరికీ కామన్‌ ఎఫెక్టివ్‌ డేట్‌ ఇవ్వాలని పంచా యతీ కార్యదర్శులు కోరుతున్నప్పటికీ దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఎఫెక్టివ్‌ డేట్‌ ఖరారు అయితేనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయి క్రమబద్ధీకరణకు మార్గం సుగమం అవుతుంది. ఆ తర్వాత శాఖపరంగా, పోలీస్‌ పరంగా కార్యదర్శులపై విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణలో ఎలాంటి రీమార్కులు లేకుంటే కార్యదర్శుల సర్వీస్‌ క్రమ బద్ధీకరణ పూర్తవుతుంది. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయని కార్యదర్శులు చెబుతు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సర్వీస్‌ క్రమబద్ధీకరణకు ప్రధానమైన కామన్‌ ఎఫెక్టివ్‌ డేట్‌ ఇవ్వాలని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని, కమిషనర్‌ నుంచి కొన్ని మార్గదర్శకాలు రావాల్సి ఉన్నాయని, ఈ లోపు పోలీసు విచారణకు కార్యదర్శుల వివరాలను రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు పంపించామని తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 12:01 AM