ఎన్టీపీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:20 AM
మానవ వనరుల కొరతను ఎదు ర్కొంటున్న ఎన్టీపీసీ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఐఎన్‌టీ యూసీ జాతీయ కార్యదర్శి, ఎన్‌బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. సత్వరమే 2 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. శనివారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని జ్యోతి ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ సమావేశాలు ప్రారంభమ య్యాయి.
జ్యోతినగర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మానవ వనరుల కొరతను ఎదు ర్కొంటున్న ఎన్టీపీసీ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఐఎన్‌టీ యూసీ జాతీయ కార్యదర్శి, ఎన్‌బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. సత్వరమే 2 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. శనివారం ఎన్టీపీసీ పీటీఎస్‌లోని జ్యోతి ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ సమావేశాలు ప్రారంభమ య్యాయి. సలీంపాషా మాట్లాడుతూ ఎన్టీపీసీలో కాంట్రాక్టీకరణతో పర్మనెం టు ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. కాంట్రాక్టు కార్మికులను పెంచి శాశ్వత ఉద్యోగులను కుదించడంతో ప్రస్తుతం పని చేస్తున్న వారిపై భారం పడుతుందన్నారు ఎన్టీపీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు ఐఎన్‌టీయూసీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కేరీర్ డెవలప్ మెంట్ కింద ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీపీసీలో ఐఎన్‌టీయూసీ బలమైన కార్మిక సంఘంగా గుర్తింపు పొందిందన్నారు. బీఎంఎస్ యూనియన్ ఎన్టీపీసీ కార్మికుల కోసం ఏమి చేసిందని ప్రశ్నించారు. దేశంలోని 15 ప్రాజెక్టులలో ఐఎన్‌టీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నదని, కేంద్రం అండ ఉందని గొప్పలు చెప్పుకునే బీఎంఎస్‌కు 3 ప్రాజెక్టులోనే గుర్తింపు సంఘంగా ఉందని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు మోదీ సర్కారు పాల్పడుతున్నదన్నారు. కార్మిక చట్టాలను మార్చి కార్మికుల హక్కు ల్ని హరిస్తున్నదని, కార్మిక సంఘాల ఉనికి లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎన్‌టియుసి ఫెడరేషన్ నాయకులు చంద్రవంశీ, ధర్మేం దర్ ప్రధాన్, సత్యనారాయణ సాహూ, వి.కృష్ణయ్య, ఆరెపల్లి రాజేశ్వర్, కొలి పాక సుజాత, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు.