కొనుగోలు కేంద్రంలో జేసీ విచారణ
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:53 PM
మండలంలోని కనగర్తి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం అదనపు కలెక్టర్ వేణు సందర్శించారు. ఎలక్ర్టిక్ కాం టాలో లోపంపై విచారణ నిర్వహించారు. కాంటాపై బస్తా తూకం వేయగా తక్కువ బరువు చూపించడంతో రైతులు నష్టపో యారు.
ఓదెల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కనగర్తి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం అదనపు కలెక్టర్ వేణు సందర్శించారు. ఎలక్ర్టిక్ కాం టాలో లోపంపై విచారణ నిర్వహించారు. కాంటాపై బస్తా తూకం వేయగా తక్కువ బరువు చూపించడంతో రైతులు నష్టపో యారు. దీంతో అదనపు కలెక్టర్ బాధిత రైతును వివరాలు తెలుసుకున్నారు. కేం ద్రంలోని కాంటాలో ఉన్న లోపం తెలుసుకొని వీవో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు పెండెం లక్ష్మిని సస్పెండ్ చేస్తూ అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రోజు కాంటాలను ఎందుకు తనిఖీ చేయలేదని, నిర్లక్ష్యం వహించినందుకు తొలగింపునకు అనివార్యమైంది. తూనికల కొలతల అధికారులు సాంకేతిక లోపం ఉన్న కాంటాను స్వాధీనం చేసుకొని వెంట తీసుకెళ్లారు. అలాగే కొనుగోలు కేంద్రంలో నిబం ధనలకు విరుద్ధంగా 41 కిలోల 200 గ్రాముల తూకం వేస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇక నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోలు మాత్రమే ధాన్యం తూకం వేయాలని, ఏ కేంద్రంలోనైనా గ్రాములు ధాన్యం తూకం వేయవద్దని సెర్ప్ ఏపీఎంను ఆదేశించారు. జేసీ వెంట తహసీల్దార్ ధీరజ్ కుమార్, ఏపీఎం సంపత్ లు ఉన్నారు.