రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్ర మరువలేనిది
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:12 AM
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు. తొలి, మలి ఉద్యమాలను నిర్వహించిన తీరును వివరించారు. స్వరాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేశారని, రాష్ట్ర అభివృద్ధికి మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవించిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నా రు. టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చందర్ మాట్లాడు తూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. నాయకులు ఐలయ్య యాద వ్, మారుతి, కృష్ణవేణి, బాదే అంజలి, జనగామ కవిత సరోజినీ, గుర్రం పద్మ, కనకలక్మి రవీందర్ రెడ్డి, వెంకటేష్, పిల్లి రమేష్ పాల్గొన్నారు.