ఎర్రజెండాలను అంతం చేయడం ఎవరితరం కాదు
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:47 PM
ఎర్రజెండాలను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. శనివారం ఎన్‌ఎస్ గార్డెన్లో సీపీఐ మండల, పట్టణ పదవ మహాసభలు నిర్వ హించారు. మహాసభల సూచకంగా ఎర్రజెండాను జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం జెండా ఆవిష్కరించారు.
పెద్దపల్లిటౌన్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఎర్రజెండాలను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. శనివారం ఎన్‌ఎస్ గార్డెన్లో సీపీఐ మండల, పట్టణ పదవ మహాసభలు నిర్వ హించారు. మహాసభల సూచకంగా ఎర్రజెండాను జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం జెండా ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలవేన శంకర్ మాట్లాడుతూ పార్టీ బలమైన శక్తిగా ఎదగడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈనెల 28న జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి వామపక్ష పార్టీ లతోపాటు మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటించడం, బూటకపు ఎన్‌కౌంటర్లతో కర్రెగుట్టలో నరమేధాన్ని సృష్టిస్తున్నారన్నారన్నారు. ఇప్పటికే 5 వందల మందికి పైగా బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపారని, ఆది వాసీలను కూడా కాల్చి చంపుతున్న పరిస్థితిని మోదీ ప్రభుత్వం తీరును ఖం డిస్తున్నామన్నారు. అణచివేత ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందని, ఇప్పటి కైనా ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జర పాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో పట్టణాల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి గెల వాలన్నారు. అప్పుడే పేద ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా కార్మిక కర్షక సమస్యల్ని పరిష్కరించేందుకు సీపీఐ ముందు ఉంటుందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, కడారి సునీల్, మార్కాపురం సూర్య, బాలసాని లెనిన్, పూసల రమేష్, ఆరేపల్లి మనోజ్ కుమార్, చంద్రగిరి ఉదయ్, కల్లేపల్లి నవీన్, దొమ్మటి రాజేష్, రవి, రామస్వామి, అంజి తదితరులు పాల్గొన్నారు.