నీటి ఎద్దడి లేకుండా చూడాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:54 PM
రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం బొంపల్లి పెద్దగుట్టలోని మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు.

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 8 (ఆంధ్ర జ్యోతి): రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం బొంపల్లి పెద్దగుట్టలోని మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవ ర్గంలోని ఆరు మండలాలు, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు పం పింగ్ స్టేషన్ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. పంపింగ్ స్టేషన్ ఏవైనా మరమ్మతు ఉంటే వెంటనే పను లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారు లకు సూచించారు. మిషన్ భగీరథ ఈఈ పూర్ణ చందర్‌రావు, పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలి
జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధి కారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపురుగుల దినోత్సవం దృష్ట్యా ఈనెల 10న పూర్తిస్థాయిలో పిల్లలందరికీ మాత్రలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహార సరఫరాలో ఇబ్బందులు ఉంటే సూపర్‌వైజర్లు వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సిడిపివోలు, అంగన్‌వాడి సూపర్‌వైజర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.