Share News

ఐఎన్‌టీయూసీకి ప్రాధాన్యతనివ్వడం సరికాదు

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:45 PM

సింగరేణి యాజమాన్యం కోడ్‌ ఆఫ్‌ డిసిప్లేన్‌ను ఉల్లంఘిస్తూ ఐఎన్‌టీయూసీకి ప్రాధాన్యతనివడం సరి కాదని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ జిగురు రవీందర్‌ తెలిపారు. ఆదివారం కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ కార్మికుల మద్దతుగా గెలిచిందని, కానీ ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘం హోదా దక్కని ఏరియాలో సైతం అధికా రులు వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.

ఐఎన్‌టీయూసీకి ప్రాధాన్యతనివ్వడం సరికాదు

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజమాన్యం కోడ్‌ ఆఫ్‌ డిసిప్లేన్‌ను ఉల్లంఘిస్తూ ఐఎన్‌టీయూసీకి ప్రాధాన్యతనివడం సరి కాదని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ జిగురు రవీందర్‌ తెలిపారు. ఆదివారం కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ కార్మికుల మద్దతుగా గెలిచిందని, కానీ ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘం హోదా దక్కని ఏరియాలో సైతం అధికా రులు వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం యాజమాన్యం 11 ఏరియాల్లో అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిందని రవీందర్‌ పేర్కొన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌కు ఏఐటీయూసీ గెలిచిన ఆర్జీ-1, 2 ఏరియాలతో పాటు బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌, మందమర్రి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ నాయకులను ఆహ్వానించడం సరికాదన్నారు. సంస్థ ప్రతిష్ట పెరిగేలా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని జాతీయ సంఘా లను ఆహ్వానిస్తే తాము సంతోషిచేవారమని, హోదాలేని యూనియన్‌ని ఆహ్వానించడం కోడ్‌ ఆఫ్‌ డిసిప్లేను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. యాజమాన్యం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాజకీయ ప్రాబల్యం పెరిగిన సింగరేణిలో యాజమాన్యం తీసు కుంటున్న ఇటువంటి నిర్ణయాలు సంస్థ నిర్వహణకు ఆటంకాలు కల్గు తాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని సింగరేణి అధికారులు నడుచుకోవాలని ఆయన సూచించారు. ఎల్‌ ప్రకాష్‌, అన్నారావు, శ్యాంసన్‌, బుర్ర తిరుపతి, గంధం సాంబశివరావు, రవికుమార్‌, సంపత్‌, మహేందర్‌, రాజ్‌కుమార్‌, వెంకటప్రసాద్‌, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:46 PM