బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:00 AM
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను అనుగదోక్కేందుకే కులగణన పేరుతో సర్వే చేపట్టిందని, ఈ సర్వేలో ఐదున్నర శాతం బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. కులగ ణన అంతా తప్పుల తడకని, రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని ఆయన పేర్కొ న్నారు.

గోదావరిఖని, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను అనుగదోక్కేందుకే కులగణన పేరుతో సర్వే చేపట్టిందని, ఈ సర్వేలో ఐదున్నర శాతం బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. కులగ ణన అంతా తప్పుల తడకని, రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని ఆయన పేర్కొ న్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో చందర్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ బీసీలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేశారన్నారు. బీసీ బంధు పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై బీసీలను వ్యతికేత రావడంతో ప్రభుత్వం మళ్లీ కుల గణన చేపట్టనుందన్నారు. బీసీలకు 42శాతం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అమలు చేయాలని, బీసీ వర్గాలకు బ్యాంకు లోన్లు, సబ్సిడీలు ఆదాయపన్ను మినహాయిం పు చేయాలని, ఓబీసీ మంత్రిత్వశాఖ శాఖను కేంద్రం ప్రభుత్వం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్నారు. కార్యనిర్వాహక న్యాయ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ సవరణ చేసి 50శాతం నిబంధన ఎత్తివే యాలని బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమా వేశం తీర్మానించారు. ఈ సమావేశంలో ఇజ్జగిరి భూమయ్య, రెడ్డి భాస్క ర్, కనకరాజు, సదానం దం ప్రశాంత్ ముది రాజ్, రాంచెందర్, కిరణ్, దివాకర్, మహేందర్, సారన్న, కొమురయ్య, మందల వెంకటేష్, పోశం, ఎలేశ్వరం వెం కటేష్, జక్కుల తిరుపతి, గాండ్ల ఉమాశంకర్‌తో పాటు నాయకులు గోపు ఐలయ్య యాదవ్, రాజ య్య, బొడ్డుపల్లి శ్రీని వాస్, అచ్చే వేణు, నూతి తిరుపతి, నారాయణ దాసు మారుతి, రమేష్, సట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు.