కేసీఆర్ ముందుచూపుతోనే ప్రతీ ఎకరాకు సాగు నీరు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:29 PM
బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపు తోనే రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందు తుందని రామ గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం బ్రాహ్మణపల్లి శివా రు పంప్‌హౌజ్ వద్ద జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపు తోనే రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందు తుందని రామ గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం బ్రాహ్మణపల్లి శివా రు పంప్‌హౌజ్ వద్ద జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రూ.76 కోట్లతో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో 20వేల ఎకరాల భూము లకు సాగునీరు అందుతున్న నేపథ్యంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారం టీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ 27న వరంగల్‌లో తలపెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, గోపు ఐలయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కోల సంతోష్ గౌడ్, మాజీ సర్పంచులు బండారి ప్రవీణ్, మేరుగు పొచం, దివ్య మల్లేష్, సతీష్ పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్
గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు మోసపూరిత హామీ ఇచ్చి గద్దెనెక్కిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అధికారం కోసం సాధ్యం కాని హామీ లు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఇప్పటి వరకు ఆ వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. స్థానిక సంస్థల్లో లబ్ధిపొందడానికే రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి యాత్ర చేస్తున్నారన్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, అచ్చె వేణు, ముద్దసాని సంధ్యారెడ్డి, చల్లా రవీందర్, నీరటి శ్రీనివాస్, విజయ్ పాల్గొన్నారు.