వాహనాల కొనుగోళ్ల కుంభకోణంపై విచారణ
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:59 PM
రామగుండంలో జరిగిన వాహనాల కొనుగోళ్ల కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ పాలన వ్యవహారాలశాఖ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మసూద్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఆర్‌డీఎంఏ వరంగల్ మసూద్ సోమవారం రామ గుండం నగరపాలక సంస్థలో విచారణ జరిపారు.

కోల్‌సిటీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రామగుండంలో జరిగిన వాహనాల కొనుగోళ్ల కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ పాలన వ్యవహారాలశాఖ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మసూద్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఆర్‌డీఎంఏ వరంగల్ మసూద్ సోమవారం రామ గుండం నగరపాలక సంస్థలో విచారణ జరిపారు. వాహ నాల కొనుగోళ్లలో, డీజిల్ వినియోగంలో అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపారు. వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఫైళ్లు విజిలెన్స్ వద్ద ఉన్నాయని, అందుబాటు లో లేవని కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు రామన్, జమీల్ పేర్కొన్నారు. ఆఫీస్‌లో ఉన్న ఫైళ్ల ప్రతులను ఆర్‌డీకి అందించారు. విజిలెన్స్‌కు లేఖరాసి ఫైళ్లను తెప్పించుకోవా ల్సిందిగా ఆర్‌డీ ఆదేశించారు. డీజిల్ వినియోగంలో అవకత వకల ఆరోపణలపై ఫైళ్లను పరిశీలించారు. లాగ్‌బుక్‌లు, ఓచర్లు పరిశీలించిన ఆయన డీజిల్ వినియోగ ప్రక్రియ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం అసలు ప్రొసీజర్ పాటించడం లేదని, ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ ఇన్ స్పెక్టర్ చేతుల మీదుగా లక్షల రూపాయల డీజిల్ వినియో గం జరుగడం ఏమిటని ప్రశ్నించారు. డీజిల్‌కు సంబంధించి కార్పొరేషన్ జారీ చేసిన టోకెన్లు, బంక్‌ల నుంచి వచ్చే బిల్లులు కూడా టోకెన్ల నెంబర్లతో రావాలన్నారు. డీజిల్ బిల్లులను సూపర్ చెక్ ఉండాలని, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు రెగ్యులర్‌గా మానిట రింగ్ చేయాలన్నారు. ప్రస్తుత విధానానికి స్వస్తి పలుకా లన్నారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్, అదనపు కలె క్టర్(స్థానిక సంస్థలు) అరుణశ్రీతో ఆర్‌డీ సమావేశమ య్యారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి నివేదిక అం దించాలని సూచించారు.
వెంటాడుతున్న కొనుగోలు వ్యవహారం
రామగుండం నగరపాలక సంస్థలో వాహనాల కొనుగోల్ మాల్‌పై ఆంధ్రజ్యోతి కథనాలతో వెలుగులోకి తీసుకువ చ్చింది. వాహనాలు కొనుగోలు చేయకుండానే ఓచర్లపై బిల్లులు చెల్లించడం, మార్కెట్ రేటుకు కంటే 40శాతం అధిక రేటుపై చెల్లింపులు జరిగాయి. ఆగ్రోస్ ఏజెన్సీని అడ్డు పెట్టుకుని నాసిరకం యంత్రాలను రామగుండంకు అప్ప గించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన జెట్టింగ్ కొన్ని రోజులకే మూలన పడగా దాని విడి భాగాలు ఇటలీ నుంచి రావాలని పెండింగ్‌లో పెట్టారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి బిల్లులు చెల్లించి ఏడాది అయినా వాహనాలు రాలేదు. కుంభకోణాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో విజిలెన్స్ విచారణలు మొదలు కావడంతో ఒక్కొక్కటిగా వాహనాలు కార్పొరేషన్‌కు చేరాయి. ఈ వాహ నాల కొనుగోలు దందాలో ఆగ్రోస్‌లో సబ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన వారికి కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, అప్పటి ప్రజా ప్రతినిధుల మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి విపక్ష కాంగ్రెస్ కార్పొరేటర్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించడం, విచారణకు ఆదేశించడం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.