ఎన్టీపీసీలో ముగిసిన ఐఎన్‌టీయూసీ ఫెడరేషన్ సమావేశాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:51 PM
రామగుండం ఎన్టీపీసీలో రెండు రోజులుగా జరిగిన ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్(ఐఎన్‌టియుసి) సమావేశా లు ఆదివారం ముగిశాయి. ఎన్టీపీసీ ఉద్యోగుల సమ స్యల పరిష్కారం, డిమాండ్లకు సంబంధించి చర్చిం చారు. సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి తీర్మానాలు చేశారు.
జ్యోతినగర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీలో రెండు రోజులుగా జరిగిన ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్(ఐఎన్‌టియుసి) సమావేశా లు ఆదివారం ముగిశాయి. ఎన్టీపీసీ ఉద్యోగుల సమ స్యల పరిష్కారం, డిమాండ్లకు సంబంధించి చర్చిం చారు. సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఎన్‌బిసి సమావేశాల నిర్వహణ క్యాలెండర్‌ను ప్రకటించాలని, ఎప్పుడు సమావేశాలు జరుగుతాయో తేదీలు ఖరారు చేయాలని తీర్మానిం చారు. తక్షణం ఉద్యోగ(వర్క్‌మెన్) నియామకాలను చేపట్టాలని, ప్రమోషన్ పాలసీ విషయంలో పూర్తిస్థాయి సమీక్ష చేసి పాలసీని ఖరారు చేయాలని తీర్మానించారు. ఫాస్ట్ ట్రాక్ పదోన్నతుల ప్రక్రియను పునరుద్ధరించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కల్పించాలని తీర్మానించారు. ఎస్‌ఎల్‌పీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగు లకు ఇంక్రిమెంటు ఇవ్వాలని తీర్మానించారు.
ఉద్యోగు లకు ప్రత్యేక సెలవులు 30 నుంచి 52కు పెంచాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా సాధారణ, జాతీయ సెలవులు ఇ వ్వాలని, సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం, 75 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం చేరిన సందర్భంగా ఉద్యోగులకు 50 గ్రాముల బంగారు నాణెం ఇవ్వాలని, బదిలీ విషయంలో అధికా రులకు ఇచ్చిన విధంగా మానస్ యాప్‌లో ఉద్యోగులు సైతం ట్రాన్స్‌ఫర్ అభ్యర్థన చేసుకునేందుకు అవకాశ మివ్వాలని, అన్ని కేటగిరి ఉద్యోగులకు కారులోను, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులు 2 సంవ త్సరాల పాటు టౌన్‌షిప్ క్వార్టర్లలో ఉండేందుకు అవకాశమివ్వాలని, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు ఉద్యో గావకాశం కల్పించాలని, అన్ని కేటగిరి ఉద్యోగులకు బి టైపు క్వార్టర్లు కేటాయిం చాలని, 39.5 శాతం కాకుండా అధిక పీఆర్‌పీ చెల్లించాలని, ముందస్తుగానే రిటైర్డ్ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్‌ను సెటిల్ చేయాలని తీర్మానించారు. రెండో రోజు ఫెడరేషన్ నాయకులు కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నారు. సమావేశంలో ఐఎన్‌టియుసి జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా, అదనపు ఎన్‌బిసి సభ్యుడు కేపి.చంద్రవంశీ, గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, ఆ రెపల్లి రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.