Share News

22 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , Publish Date - May 19 , 2025 | 11:58 PM

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లి మెంటరీ పరీక్షలు ఈనెల 22నుంచి 28వరకు జరుగుతాయని, వీటి నిర్వహ ణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అధికారు లను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమా వేశం నిర్వహించారు.

22 నుంచి ఇంటర్‌   సప్లిమెంటరీ పరీక్షలు

పెద్దపల్లి కల్చరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లి మెంటరీ పరీక్షలు ఈనెల 22నుంచి 28వరకు జరుగుతాయని, వీటి నిర్వహ ణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణు అధికారు లను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమా వేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12గంటల, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్ష జరుగుతాయని తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,538మంది హాజరవుతారని, పరీక్షలను పకడ్బం దీగా నిర్వహించేందుకు ప్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించాల న్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీ సర్‌ పాల్గొంటారని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిం చాలన్నారు. సీసీ కెమెరా నిఘాలో ప్రఽశ్నపత్రాలు తెరువాలని, కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, వైద్యసదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లా ఇంటర్మీ డియట్‌ నోడల్‌ అధికారి కల్పన, డీఈవో మాధవి పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:58 PM