నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:11 AM
ఇంటర్మీడియట్ పరీక్షల కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 23సెంటర్లలో పరీక్షలు బుధవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు, నిర్వహించ నున్నట్లు నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 10,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 23సెంటర్లలో పరీక్షలు బుధవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు, నిర్వహించ నున్నట్లు నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 10,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు సెంటర్ వెతుక్కునే ఇబ్బంది లేకుండా లొకేషన్ రూట్‌మ్యాప్‌తో క్యూఆర్ కోడ్ హాల్‌టికెట్లతోపాటు పంపించారు. పరీక్ష కేంద్రానికి నియ మించిన ఛీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌లకు శిక్షణ ఇచ్చారు. ప్రతీ కేంద్రంలో సీసీకెమరా, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా పరీక్ష లు రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు నోడల్ అధికారి తెలిపారు.
కోల్‌సిటీటౌన్ (ఆంధ్రజ్యోతి): రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని ప్రాంతాల్లో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రామగుండంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎన్‌టీపీసీలో సచ్‌దేవ జూనియర్ కళా శాల, గోదావరిఖనిలో ప్రభుత్వ బాలుర కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాల, ఎఫ్‌సీఐ గౌతమినగర్(శాంతినగర్)లోని తెలం గాణ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
40నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు
ఇంటర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12 వ రకు పరీక్షలు జరుగుతాయని నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని, 40 నిమిషాల ముందు నుంచే కేంద్రాలకు అనుమతిస్తామన్నారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. 9 గంటల 5 నిమిషాల తరువాత వచ్చిన వారిని అనుమతించమని తెలిపారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపాల్ అమరేం దర్ తెలిపారు. కేజీబీవీ మాడల్ కళాశాలలకు చెందిన ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 260 మంది పరీక్షలకు హాజరవుతు న్నారని తెలిపారు. విద్యార్థులంతా సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.