Share News

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్స్‌

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:59 PM

విద్యార్థుల బంగారు భవిష్యత్‌ తీర్చిదిద్దడానికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. గురువారం మిని గురు కుల పాఠశాలలో రూ.10 లక్షలతో నిర్మించిన డైనింగ్‌ హాల్‌ను ప్రారంభిం చారు. అనంతరం డైనింగ్‌ హాల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్స్‌

ధర్మారం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల బంగారు భవిష్యత్‌ తీర్చిదిద్దడానికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. గురువారం మిని గురు కుల పాఠశాలలో రూ.10 లక్షలతో నిర్మించిన డైనింగ్‌ హాల్‌ను ప్రారంభిం చారు. అనంతరం డైనింగ్‌ హాల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అడ్లూరి మాట్లాడుతూ గురుకులాల్లో మౌలిక వసతుల రూపకల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని పాశిగామలో 200 ఎకరాలలో 145 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ పనులు మొదలు పెడుతామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించిన కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు అడ్లూరి కృతజ్ఞతలు తెలిపారు. డీపీఓ వీరబుచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థులు కింద కూర్చొని భోజనం చేస్తుండడం, కిందనే పడుకోవడంతో కలెక్టర్‌ చొరవతో డైనింగ్‌ హాల్‌ నిర్మాణంతోపాటు రూ.2 లక్షలతో పరుపులను కొనిచ్చారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లానాయక్‌ లంబాడి బాషలో ప్రసంగించి ఆకర్షించారు. డిప్యూటీ సెక్రెటరీ వేణుగోపాల్‌, తహసీల్దార్‌ ఎండీ వఖీల్‌, ఎంపీడీఒ ప్రవీణ్‌ కుమార్‌, డీఈ రాజమౌళి, పీఆర్‌ ఏఈ రాజశేఖర్‌, ఎంఈఓ పోతు ప్రభాకర్‌, ఎంపీఓ రమేష్‌, నాయకులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, లింగయ్య, అజయ్‌, తిరుపతి, స్వామి, దేవి జనార్దన్‌, కొత్త నర్సింహులు, పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:59 PM